ETV Bharat / state

సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రతను గాలికొదిలేసిన వైసీపీ సర్కారు - పట్టించుకోండి మహాప్రభో! - సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం

YCP Govt Ignored Irrigation Projects in AP: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రతను.. వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. అన్నమయ్య, పింఛ డ్యాంలు కొట్టుకుపోయి రెండేళ్లు గడిచినా.. సర్కారు మొద్దునిద్ర వీడలేదు. గుండ్లకమ్మ, పులిచింతల ప్రాజెక్టుల నిర్వహణకు ఇంతవరకూ.. నిధులివ్వలేదు. ప్రాజెక్టుల నిర్వహణపై సీఎం మాటలన్నీ కాకమ్మ కబుర్లుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

YCP_Govt_Ignored_Irrigation_Projects_in_AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 10:06 AM IST

YCP Govt Ignored Irrigation Projects in AP: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రతను.. వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. అన్నమయ్య, పింఛ డ్యాంలు కొట్టుకుపోయి రెండేళ్లు గడిచినా.. సర్కారు మొద్దునిద్ర వీడలేదు. గుండ్లకమ్మ, పులిచింతల ప్రాజెక్టుల నిర్వహణకు ఇంతవరకూ.. నిధులివ్వలేదు. ప్రాజెక్టుల నిర్వహణపై సీఎం మాటలన్నీ కాకమ్మ కబుర్లుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాం భారీ వరద ప్రవాహాలకు 2021 నవంబరు 19న కొట్టుకుపోయి 39 మంది మరణించారు. ఆ తర్వాత.. సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులనూ అత్యవసరంగా ఉద్ధరించాలని.. హడావుడి చేశారు. రెండు కమిటీలతో అన్ని కోణాల్లో అధ్యయనం చేసి.. ప్రాజెక్టుల నిర్వహణను అద్భుతంగా తీర్చిదిద్దేస్తామని సీఎం సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.

సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వని వైసీపీ సర్కారు- నాలుగున్నరేళ్లలో రెండే ప్రాజెక్టులు

ఆ తర్వాత.. 2022 ఆగస్టు 31న ఉమ్మడి ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయింది. ఇప్పటికీ గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు చాలినన్ని నిధులు ఇవ్వలేదు. 2022 ఆగస్టు 31న కొట్టుకుపోయిన గేటు ఇప్పటికీ అలాగే ఉంది. 2021 ఆగస్టులో పులిచింతల గేటు కొట్టుకుపోతే నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఇప్పటికీ పూర్తి స్థాయి పనులు చేయలేదు.

గేటు ఏర్పాటు చేసినా ఇతర సిఫార్సులు అమలు చేయాలి. మరి ఆ సమయంలో.. ఆ రెండు కమిటీలు ఏం చేశాయో తెలియని పరిస్థితి. గుండ్లకమ్మ ప్రాజెక్టులో.. 10 గేట్లు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు అత్యవసరంగా 3 కోట్ల రూపాయలు కావాలని ఇంజినీర్లు ప్రతిపాదించినా ప్రభుత్వం నిధులు విదిల్చలేదు. జగన్‌ కబుర్లు చెప్పడం తప్ప కార్యాచరణ లేదని విపక్షాలు తప్పుపడుతున్నాయి.

నిధులు లేక.. నిర్మాణాలకు నోచుకోని ప్రాజెక్టులు

2021 ఆగస్టులో పులిచింతల గేటు కొట్టుకుపోతే నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఇప్పటికీ పూర్తి స్థాయి పనులు చేయలేదు. స్టాప్‌లాక్‌ గేట్‌తో సరిపెట్టారు. జంగారెడ్డిగూడెం మండలం ఎర్రకాలువ జలాశయంలో నిర్వహణ పనులకు పాలనామోదం ఇచ్చినా.. పనులు పూర్తికాలేదు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీలోని 175 గేట్లలో.. 53 గేట్లు మినహా మిగతా వాటికి మరమ్మతులు చేయాల్సి ఉన్నా.. నిధులివ్వక పనులు జరగట్లేదు.

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ పనులూ అంతే. పెండింగు బిల్లులు.. సకాలంలో చెల్లించకపోవడంతో గుత్తేదారులు సగం పనులు చేసి వెళ్లిపోతున్నారు. జగన్‌ ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్న నమ్మకం లేకపోవడంతో ప్రాజెక్టుల్లో చిన్న చిన్న పనులకూ గుత్తేదారులు ముందుకు రావట్లేదు. ప్రాజెక్టుల్లో కనీసం గ్రీజు పెట్టేందుకు, ఇతర చిన్న పనులకూ ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని.. ఇంజినీర్లు గగ్గోలు పెడుతున్నారు.

మూలన పడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు.. సాగునీటి కోసం రైతుల చూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.