Tiger killed a cow in Doddipalli: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం దొడ్డిపల్లెలో పశువుల పాకపై పెద్దపులి దాడి చేసి పాడి ఆవును చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొడ్డిపల్లెకు చెందిన చౌడప్ప, ఆయన కుమారుడు తమ వ్యవసాయ పొలంలోని ఉన్న చౌడేశ్వరీదేవి ఆలయంలో ఆదివారం రాత్రి నిద్రిస్తున్నారు. ఆ సమయంలో గాండ్రిస్తూ వచ్చిన పెద్దపులి పశువుల పాక మీదపడి ఆవును చంపి అడవిలోకి ఈడ్చుకెళ్లింది. పెద్దపులి దాడితో ఆందోళనకు గురైన చౌడప్ప, ఆయన కుమారుడు వెంకటరమణ ప్రాణభయంతో ఆలయంలో దాక్కుండి పోయారు. తెల్లవారిన తర్వాత బయటకు వచ్చిన చౌడప్ప పులి దాడి సమాచారాన్ని గ్రామస్థులకు తెలిపారు.
ఘటనపై గ్రామస్థుల అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో అక్కడికి వచ్చి పాద ముద్రలు పరిశీలించారు. కర్ణాటక సరిహద్దులోని కారంగి అటవీప్రాతం నుంచి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. దారి పొడువునా పులి పాదముద్రలు స్పష్టంగా ఉండటంతో దొడ్డిపల్లె, బరిడేపల్లె గ్రామస్ధులు గొర్రెలు, మేకలు, పాడి ఆవులను పొలాల వద్దకు తీసుకెళ్లేందుకు భయపడుతున్నారు. రాత్రివేళ్లల్లో పెద్దపులి గ్రామాలపై దాడి చేస్తుందేమోనన్న ఆందోళన గ్రామస్ధుల్లో నెలకొంది. నాలుగు నెలల క్రితం ఇలాంటి ఘటన జరిగిందని... అటవీశాఖాధికారులు స్పందించి తమకు ప్రాణనష్టం లేకుండా చూడాలని గ్రామస్ధులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: