- సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు
ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.
- రాష్ట్రంలో విధ్వంసాలు ఆగాలంటే జగన్ సైకో పాలన పోవాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసాలు ఆగాలన్నా, రాష్ట్రం బాగు పడాలన్నా.. జగన్ సైకో పాలన పోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ విధ్వంస పాలనతో ఐటీ సహా ఇతర పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో.. సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయని మండిపడ్డారు. తెలుగుదేశం పాలనా పగ్గాలు చేపడితే.. వ్యవస్థలన్నింటినీ బాగు చేస్తామని భరోసా ఇచ్చారు.
- సీఎం పునాది వేసిన మూడేళ్ల తర్వాత కూడా అతీగతి లేని కడప ఉక్కు
ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు. ఇదీ.. కడప ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పిన మాట. అంతేకాదు.. మూడేళ్లలో పరిశ్రమను పూర్తిచేస్తామని సగర్వంగా ప్రకటించారు. చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయింది. పరిశ్రమ పూర్తవడం సంగతి దేవుడెరుగు.. కనీసం నిర్మాణ పనులు కూడా మొదలుకాలేదు. ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ఊరికి మహర్దశ పడుతుందని ఆశించిన సున్నపురాళ్లపల్లె ప్రజలు.... ఇచ్చిన మాట నిలబెట్టుకునేదెప్పుడు జగనన్నా అని ప్రశ్నిస్తున్నారు.
- కర్నూలులో విషాదం.. బాణసంచా పేలి బాలుడు మృతి
కర్నూలు నగరంలోని సీతారాం నగర్లో విషాదం చోటు చేసుకుంది.. ఓ ఇంట్లో నిల్వ చేసిన బాణసంచా పేలి బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి గాయాలయ్యాయి. ఇంటి యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- విదేశాల నుంచి వస్తే కొవిడ్ పరీక్షలు తప్పనిసరి.. ప్రతి విమానంలో 2 శాతం మందికి
మరో మారు కొవిడ్ కేసులు పెరుగుతున్నందున విదేశాల నుంచి వచ్చే 2% మంది ప్రయాణికులకు విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం పౌరవిమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్‌కు లేఖ రాశారు.
- ఉక్రెయిన్ కోరికలకు నో చెప్పిన అమెరికా.. అందుకేనా!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా పర్యటనలో భాగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా ఉక్రెయిన్‌కు చేస్తున్నది సాయం కాదని.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆ దేశం పెడుతోన్న పెట్టుబడులను వ్యాఖ్యానించారు. రష్యాపై మా విజయం కేవలం ఉక్రెయిన్ విజయమేకాదు, అమెరికా విజయం కూడా అని అన్నారు.
- 'ఆ దేశాల దారిలో వెళితే మనుగడ సాధించలేం.. భిన్నమైన వ్యూహం అవసరం'
ఔషధ రంగంలో ప్రపంచ దేశాలు అవలంభిస్తున్న ధోరణిలో పోతే పోటీలో ఉండలేమన్నారు ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్. మనదేశం నుంచి ఔషధ ఎగుమతులను స్థిరంగా పెంచుకోవాలంటే భిన్నమైన వ్యూహం అవసరమని ఇంటర్వ్యూలో తెలిపారు.
- కరెన్సీపై మెస్సీ ఫొటో.. ఆ దేశం కీలక నిర్ణయం!
మెస్సీ ప్రభంజన ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సెలెబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరో వార్త అతడి అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. అర్జెంటీనా కరెన్సీపై మెస్సీ ఫొటో ముద్రించబోతున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే..
- 'చిరంజీవితో శక్తిమంతమైన పాత్ర చేస్తున్నా'
మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేసిన మాస్ ఎంటర్టైనర్ ధమాకా. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనున్న వేళ మూవీ గురించి కొన్ని ముచ్చట్లు ఆయన మాటల్లోనే.