WAR BETWEEN YSRCP AND BJP : అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దేవగిరిలో ఆదివారం నిర్వహించిన భాజపా ప్రజాపోరు యాత్రను స్థానిక వైకాపా నాయకులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోరుయాత్ర ముగింపు సందర్భంగా గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న భాజపా నాయకులతో.. వైకాపా నాయకులు గొడవపడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. భాజపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైకాపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
భాజపా అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందింటి శ్రీనివాసులు మాట్లాడుతుండగా.. వైకాపా నాయకులు అడ్డుకున్నారు. కేంద్ర పథకాలపై ప్రచారం చేస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు భాజపా నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాంధీ జయంతి రోజున మద్యం తాగి వచ్చి.. గొడవకు దిగారని భాజపా నాయకులు ఆరోపించారు. ధైర్యముంటే నీతివంతంగా భాజపాను అడ్డుకోవాలని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు.
ఇవీ చదవండి: