అనంతపురం జిల్లా తలుపుల మండలం ఉడుమలకుర్తి గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డితో కలిసి వైకాపా సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విమర్శలు గుప్పించారు.
అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలను అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారు. అందుకు విరుద్ధంగా మండలంలో లేనిపోని రాజకీయాలు చేస్తూ వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను తొలగించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. దీన్ని చూస్తూ ఊరుకోం. ‘మీరు కాంట్రాక్టులు చేసుకోండి... లంచాలు తీసుకోండి... దోపిడీలూ చేసుకోండి.. కానీ జెండా మోసిన కార్యకర్తలు, వాలంటీర్లకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోం’ అని అన్నారు. ఎంపీడీవో గారూ.. మీరు ప్రభుత్వ ఉద్యోగులు. మీకు జీతం వస్తోంది. రాజకీయాలు చేస్తే మీ ఉద్యోగాలు ఊడగొడతాం జాగ్రత్త. వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చేది రూ.5వేలు. ఆ మొత్తం వారి ద్విచక్ర వాహనాల పెట్రోలు, టీ ఖర్చులకూ సరిపోదు. స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వారిపైనా మీ ప్రతాపం. -పూల శ్రీనివాసులరెడ్డి
అంటూ పరోక్షంగా ఎమ్మెల్యే, ఆయన వర్గీయులను, అధికారులను పూల శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వేదికపైనే ఉన్నా కనీసం స్పందించకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: varalakshmi vratham: వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలంటే..?