ETV Bharat / state

మేమూ వైసీపీ వాళ్ళమే..! ఆ కారణంతోనే మాకు రోడ్డు వేయలేదు..

YSRCP Activist : బీసీలమనే చిన్నచూపుతోనే బీసీలు నివాసం ఉండే చోటుకు రోడ్లు వేయటం లేదని ఓ వైసీపీ కార్యకర్త అసహనం వ్యక్తం చేశారు. గోతులు పడిన రోడ్లతో అవస్థలు పడుతున్నామని ఆయన అన్నారు.

YSRCP Activist
వైసీపీ కార్యకర్త
author img

By

Published : Dec 17, 2022, 8:16 PM IST

YSRCP Activist : అనంతపురం వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిపై ఆ పార్టీ కార్యకర్త తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రామ్​నగర్ 37వ డివిజన్​లోని ఓ వీధిలో రెడ్డి సామాజిక వర్గం నివాసాలు ఉన్నంత వరకు మాత్రమే సీసీ రోడ్డు వేశారని, బీసీలు నివసించే చోటు వరకు రోడ్డు వేయకపోవడంతో.. గోతులు పడిన మట్టి రోడ్డుతో అవస్థలు పడుతున్నామని కార్యకర్త వీరాంజనేయగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీ కార్యకర్త అయినప్పటికీ ఎమ్మెల్యేను తన వీధిలోకి తీసుకురాలేక పోతున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

" వారి వర్గానికి చెందిన వారు పంచాయతీలో ఉన్న వారికి రోడ్లు వేశారు. మేము మున్సిపాలిటీలో ఉన్నాము అయినా మాకు రోడ్డు వేయలేదు. మేము బీసీలము కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. పేరుకు మాత్రం అందరం జై జగనన్న అనుకున్నం. మాకు సరైన న్యాయం జరగటం లేదు. బయటికి చెప్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందేమోనని.. చెప్పలేక ఉన్నవారు చాలామంది ఉన్నారు." -వీరాంజనేయగౌడ్, వైసీపీ కార్యకర్త

అడ్డుకున్న వైసీపీ నేతలు : రోడ్లు వేయటం లేదని వైసీపీ కార్యకర్త అసంతృప్తి వ్యక్తం చేయటంపై జనసేన నేతలు స్పందించారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు జనసేన నేతలు ముందుకు వచ్చారు. రోడ్ల మరమ్మతు చర్యలు చేపట్టకుండా జనసేన నేతలను.. వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అయినా గుంతలు పడిన ఈ రోడ్ల మరమ్మతులు పూర్తి చేసి తీరతామని జనసేన నేతలు ప్రకటించారు.

బీసీలు నివసించే చోట రోడ్లు వేయలేదంటూ ఆవేదన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.