అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో చంద్ర, రామలక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దేవేంద్ర, శ్రీను, రాజు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా దేవేంద్ర, శ్రీను మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున అన్న దేవేంద్రను తమ్ముడు శ్రీను గడ్డపారతో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: టైర్ పేలి లారీని ఢీకొట్టిన కారు.. నవదంపతులతో సహా ఐదుగురికి గాయాలు