ETV Bharat / state

కిడ్నాపైన కార్తీక్​ సురక్షితం..పోలీసుల అదుపులో కిడ్నాపర్లు - అనంతపురం జిల్లా క్రైమ్ వార్తలు

అనంతపురం జిల్లా ధర్మవరంలో కిడ్నాపైన కార్తీక్​ను పోలీసులు రక్షించారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నాపైన కార్తీక్​ సురక్షితం
కిడ్నాపైన కార్తీక్​ సురక్షితం
author img

By

Published : Jun 20, 2020, 3:39 PM IST

Updated : Jun 20, 2020, 5:23 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం గాంధీనగర్​కు చెందిన ఓ యువకుడు కిడ్నాప్​నకు గురయ్యాడు. కార్తీక్ అనే 22 ఏళ్ల యువకుడు నగరంలోని ఒక వ్యక్తి వద్ద సెల్​ఫోన్ కొన్నాడు. దానికి సంబంధించి 3 వేల రూపాయలు అతనికి ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులు కార్తీక్​ను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు.

అనంతరం కార్తీక్ సోదరి నవ్యకు ఫోన్ చేసి 'మీ తమ్ముణ్ని కిడ్నాప్ చేశామని.. తమకు రూ.5 లక్షలు కావాలంటూ' డిమాండ్ చేశారు. కార్తీక్​ను హింసించిన దృశ్యాలను నవ్య వాట్సాప్​కు పంపించారు. దీంతో ఆమె అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన క్రాంతి, సూర్య అనే యువకులు తన సోదరుడిని అపహరణ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కార్తీక్​ను సురక్షితంగా తీసుకొచ్చారు. అతన్ని అపహరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి...

అమాయకులను నమ్మబలుకుతాడు... అందినకాడికి దోచుకుంటాడు

Last Updated : Jun 20, 2020, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.