ఉద్యోగం రాలేదనే మనస్థాపంతో.. హరీశ్ కుమార్ అనే యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన హరీష్.. డిగ్రీ చదివాడు. ఆర్మీలో చేరేందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. శిక్షణ తీసుకున్నాడు. రెండు మార్లు ప్రయత్నించినా ఆర్మీలో ఎంపిక కాలేదు. కొంతకాలంగా ఇంటివద్దనే ముభావంగా ఉన్నాడు. స్థానికంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో.. మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన హరీశ్... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని తండ్రి గంగాధర్ గృహ నిర్మాణ శాఖ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మవరం పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: