అనంతపురం జిల్లా కదిరి పట్టణం నిజాంపల్లి కాలనీ సమీపంలో రైలు కిందపడి మల్లికార్జున అనే యువకుడు బలవర్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పట్టణంలోని అమీన్నగర్కు చెందిన మల్లికార్జున.. అన్నయ్య దగ్గర ఉంటూ ఎలక్ట్రిషన్‌గా పనిచేసేవాడని కుటుంబీకులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: