అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులోని వ్యవసాయ పొలంలో రాజు అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నడకకు వెళ్లిన వారు విషయాన్ని గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజు తల్లిదండ్రులు అతని చిన్నప్పుడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అమ్మమ్మతో పాటు ఉంటూ.. పట్టణంలో ఫైటర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని చెప్పారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: జాతీయ రహదారిపై కారు దగ్దం..