అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిళంలో విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందాడు. మండలంలోని అమిద్యాలకు చెందిన రైతు లాలుస్వామి పెన్నహోబిళంలోని దేవాలయ భూమిని కౌలుకు చేసుకుంటున్నాడు. ఉదయం పొలానికి నీరు వదిలేందుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ స్టాటర్ బాక్సు కిందపడటంతో దాన్ని తీసి పెట్టే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. అతను ఎంతసేపటికీ ఇంటికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పొలానికి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శవపరీక్ష కోసం పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: