ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేశామని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురంలో 1, 4, 5 డివిజన్లలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలపైన ఆరా తీశారు. పింఛను సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సాగు, తాగునీరు కొరత లేకుండా చూస్తున్నామన్నారు. జిల్లాకు 23 వేల ఇళ్లను మంజూరు చేయించామని చెప్పారు.ఇంటి స్థలాలు లబ్ధిదారులకు ఇవ్వడానికి చూస్తే తేదేపా ప్రభుత్వం కుట్రపూరితంగా కార్యక్రమానికి అడ్డుకట్ట వేశారన్నారు.
ఇవీ చదవండి