మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ... అనంతపురం జిల్లా కదిరిలో వైకాపా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ద్విచక్ర వాహనాలపై ప్రదర్శన చేశారు.
ఇదీ చూడండి; ముఖ్యమంత్రికి వైకాపా శ్రేణుల ధన్యవాదాలు