అనంతపురం జిల్లా ధర్మవరం మండలం వెంకట తిమ్మాపురంలో.. భాజపా ఏజెంట్ నారాయణస్వామిపై దాడి జరిగింది. వైకాపా శ్రేణులు తనను అపహరించి చితకబాదారని.. ఆయన వాపోయారు. భాజపా ఎంపీటీసీ అభ్యర్థి కల్పన తరఫున ఏజెంట్‌గా కూర్చున్న తనను.. పోలీసులు పిలుస్తున్నారంటూ బయటకు పిలిచి.. కారులో ఎత్తుకెళ్లి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నారాయణస్వామికి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి