పండుగలకు వేతనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తాగునీటి కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రజల దాహార్తిని తీరుస్తున్న తమకు పండగ సమయాల్లోనూ వేతనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు అసౌకర్యం కలగకూడదని విధులు నిర్వహిస్తూ... ప్రజలకు తాగునీరు అందిస్తున్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా 120 మంది కార్మికులు పని చేస్తున్నాం. పండుగ సమయాల్లో కూడా చాలామందికి ఇప్పటి వరకు సంబంధిత కాంట్రాక్టర్లు జీతాలు అందించలేదు. వీటితో పాటు దసరా బోనస్‌ను ఇప్పటివరకు ప్రకటించలేదు. అధికారులు చొరవ చూపి పండుగ వేళల్లో తమకు జీతాలు అందించేలా చర్యలు చేపట్టాలి
- తాగునీటి పథకం కార్మికుడు
ఇదీ చదవండీ...పండగ సీజన్లో ఆటోమొబైల్స్ జోరు