అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం శివపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై పార్వతమ్మ అనే మహిళ మృతి చెందింది. వర్షం కురుస్తుండడంతో బయట దిమ్మెకు గొలుసుతో కట్టేసిన పెంపుడు కుక్కను విడిచిపెట్టేందుకు వెళ్లింది. ఆ సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. పార్వతమ్మతో పాటు పెంపుడు కుక్క కూడా మృత్యువాత పడింది. మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'వైకాపా నేతలు దాడులు చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి'