Woman Agitation: అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన లక్ష్మి.. బాబా మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉన్నారు. డిసెంబర్ నెల 13న మహిళలందరి తరఫున యానిమేటర్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. దీనికి సంబంధించి లక్ష్మికి ఇవ్వాల్సిన లక్ష రూపాయలు రుణాన్ని యానిమేటర్ వహీదా ఇవ్వకపోవడంతో లక్ష్మి ఉరవకొండ వెలుగు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. ఇవాళ సాయంత్రం లోపల తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకుంటే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెలుగు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేస్తున్న మహిళను, యానిమేటర్ను ఉరవకొండ పోలీసు స్టేషన్కు పిలిపించి ఎస్ఐ వెంకటస్వామి విచారణ చేస్తున్నారు.
ఇవీ చదవండి: