కరోనా వైరస్ ప్రభావంతో అనంతపరం జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అత్యవసరాలు తప్ప ముఖ్యమైనవాటిని అన్నింటిని మూసివేశారు. గుంతకల్లు మండలంలోని నక్కన్నదొడ్డి తిమ్మాపురం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2వేల 500 లీటర్ల కల్లును పారబోశారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చూడండి: