ETV Bharat / state

విషాదం.. ఉరి వేసుకుని దంపతుల బలవన్మరణం - అనంతపురంలో దంపతుల ఆత్మహత్య

అనంతపురం జిల్లా కొర్రకోడుడ్యామ్​లో కుటుంబ కలహాలతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసి వెళ్లిపోయారు.

wife and husband suicide in korrakodu dyam in ananthapuram district
ఉరివేసుకుని దంపతుల బలవన్మరణం
author img

By

Published : Dec 2, 2019, 12:58 PM IST

అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు డ్యామ్ గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వాసు, నాగతేజస్విని కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాసు అదే గ్రామంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ తాగునీటి ప్రాజెక్టులో సూపర్​వైజర్​గా పనిచేస్తున్నాడు. మొదట్లో ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. అయితే కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. శనివారం రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేశారు. పిల్లలు పడుకున్నాక ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను చూసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఉరివేసుకుని దంపతుల బలవన్మరణం
Contributor : B. Yerriswamy Center : uravakonda, ananthapuram (D) Date : 01-12-2019 Sluge : ap_atp_71_01_wife_husben_suside_AV_AP10097 Cell : 9704532806 అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గం, కూడేరు మండలం కూడేరు మండలం కొరకొడు గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భార్య, భర్త ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జయవర్ధన్, మోక్షతలు ఉన్నారు. వాసు (29) నాగతేజస్విని (26) ఇద్దరు కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వాసు అనే వ్యక్తి అదే గ్రామంలో RWS త్రాగునీటి ప్రాజెక్టులో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. మొదటి నుండి ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారని, ఈ మధ్యకాలంలో ఏమైందో తెలియదు అని స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు గొడవపడి ఉరివేసుకున్నారు, అయితే వాసు అనే వ్యక్తి ఉరి వేసుకున్న తరువాత అతని బరువును తట్టుకోలేక తాడు తెగిపోవడంతో అతని తల గుమ్మానికి తగిలి తీవ్ర రక్తస్రావం అయ్యిందని స్థానికులు, పోలీసులు భావించారు. ఉదయం స్థానికులు చూసి విషయన్నీ పోలీసులకు తెలిపారు. వారు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు మరణించడంతో ఆ చిన్నారుల పరిస్థితి ఏంటో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.