అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తూముకుంటలో సుమారు 31 కుటుంబాలు మగ్గాలపై చీరలు నేస్తాయి. మరో 15 కుటుంబాల వారు కంబళ్ళు నేస్తారు. గతేడాది తూముకుంట పంచాయతీలో 44 మంది లబ్ధిదారులకు జగనన్న నేతన్న నేస్తం పథకం డబ్బులు అందాయి. అయితే ఈ సంవత్సరం 13 కుటుంబాలనే అర్హులుగా పరిగణించారు. మిగతా వారికి మొండిచెయ్యి చూపారు.
ఇంటింటికీ వచ్చి జియో ట్యాగింగ్ వేసి 20 మందిని అర్హులుగా గుర్తించారని... అందులోనూ 5గురి పేర్లు ఆన్లైన్లో నమోదు చేయలేదని వాపోయారు. దీనిపై నేతన్నలు గ్రామ సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. పథకానికి అందరూ అర్హులే అని ఏడీఓ చెబుతున్నా.. కిందిస్థాయి సిబ్బంది మాత్రం సైట్ క్లోజ్ అయ్యింది, పేర్లు నమోదు చేయడం కుదరదని చెప్తున్నారని నేతన్నలు చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇవీ చదవండి..