అనంతపురం జిల్లాలో 700 కోట్ల రూపాయలతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద త్రాగునీటి పైప్ లైన్ ప్రాజెక్టు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం. ఈ ప్రాజెక్టులో పనిచేస్తోన్న కార్మికులు తమకు కొన్ని నెలలుగా జీతాలు అందడం లేదని మడకశిర పంపుహౌస్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. నీటి సరఫరా నిలిపేసి ఆందోళన చేశారు. ఇంతకుమునుపు సమ్మె చేసినప్పుడు సమస్య పరిష్కరిస్తామన్న అధికారుల హామీతో విరమించుకున్నామని మడకశిర ప్రాజెక్టు అధ్యక్షుడు పేర్కొన్నారు. అయినా తమకు వేతనాలు అందలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు విడుదల చేయాలని కోరారు.
ఇదీ చూడండి: