ETV Bharat / state

వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు: పరిటాల సునీత - వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు

పురపాలక ఎన్నికల్లో వార్డు వాలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని.. మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పరిటాల సునీత ఆరోపించారు.

Volunteers are influencing voters
వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు :మాజీ మంత్రి పరిటాల సునీత
author img

By

Published : Mar 7, 2021, 12:12 PM IST

వార్డుల్లో వాలంటీర్లు ఓటర్లను బెదిరిస్తూ.. ఓటర్ స్లిప్​లు పంచుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరం గుట్టకింద కాలనీలో అభ్యర్థుల తరపున ఆమె ప్రచారం చేశారు.

అక్కడ ప్రచారం చేస్తున్న ఓ వార్డు వాలంటీర్​ను నిలదీశారు. వాలంటీర్ అయివుండి.. ఓటర్ స్లిప్​లు ఎలా పంచుతావని అడగటంతో సదరు వ్యక్తి అక్కడినుంచి జారుకునే యత్నం చేశారు. వాలంటీర్లు వైకాపాకే ఓటు వేయాలని ఓటర్లను బెదిరిస్తున్నారని సునీత ఆరోపించారు.

ఇదీ చూడండి:

చివరి దశకు చేరుకున్న పురపోరు... పోటాపోటీగా అధికార, విపక్షాల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.