ETV Bharat / state

అనంతపురం జిల్లాలో సచివాలయ పరీక్షలు - sachivalayam exams

అనంతపురం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు పలు కేంద్రాలలో పరీక్షలు రాస్తున్నారు.

village ward  Secretariat Examinations at anantapur district
అనంతపురం జిల్లాలో సచివాలయ పరీక్షలు
author img

By

Published : Sep 20, 2020, 3:58 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వివిధ మండలాల నుంచి పరీక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం కదిరి పట్టణంలోని 15 కేంద్రాలలో 2,597 మంది... మధ్యాహ్నం 13 కేంద్రాల్లో 2,222 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కదిరి ఆర్డీఓ వెంకటరెడ్డి, డిఎస్పీ శ్రీనివాసులు తహసీల్దార్ మారుతి ఇతర అధికారులు పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాల్లో మొదటి రోజే నిర్లక్ష్యం వెల్లువెత్తింది. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనా నిబంధనలు పాటించడంలో అధికారులు విఫలమయ్యారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో సచివాలయం పరీక్షలు రాయడానికి ఏర్పాటు చేశారు. జిల్లాలో 560 మంది అభ్యర్థులు ఇందులో పరీక్షలు రాస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయం నుంచి వచ్చిన అభ్యర్థులు వైద్య సిబ్బంది లేకపోవడంతో కేంద్ర ముఖద్వారం ముందు నిరీక్షించాల్సి వచ్చింది.

కల్యాణదుర్గం పట్టణ కేంద్రంలో దాదాపు 14 సెంటర్​లలో పరీక్షలు ప్రారంభమయ్యయి. అధికారులు నిన్నటినుంచే అన్ని పరీక్షా కేంద్రాలలో శానిటేషన్ పనులు పూర్తి చేశారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా సెల్​ఫోన్ భద్రపరిచే కేంద్రాలు, థర్మల్ స్క్రీనింగ్. హ్యాండ్ శానిటేషన్​ను అందుబాటులో ఉంచారు. అయితే కొన్ని పరీక్షా కేంద్రాలలో సామాజిక దూరం పాటించలేదు. స్థానిక డీఎస్పీ వెంకటరమణ రామ్మోహన్ పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

ఇదీ చూడండి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా సచివాలయ పరీక్షలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.