ETV Bharat / state

కంకర క్వారీపై విజిలెన్స్ దాడులు - అనంతపురం తాజా వార్తలు

పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ఓ కంకర క్వారీపై విజిలెన్స్, మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. కొండలో తవ్వుకున్న బండ కొలతలు, నిల్వ ఉంచిన కంకర కుప్పల కొలతలు తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని డీఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు.

విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసిన కంకర క్వారీ

author img

By

Published : Mar 26, 2021, 7:18 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని ఓ తెదేపా మహిళా నాయకురాలికి చెందిన కంకర క్వారీపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్, మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. క్వారీలో అక్రమాలు జరిగాయన్న సమాచారంతో అధికారులు క్వారీని పరిశీలించారు. ముందు భాగం కొండగా కనపడుతుందని వెనుక భాగంలో కొండని పిండి చేసి.. అనుమతులు పొందిన దానికంటే ఎక్కువగా బండను తవ్వేసినట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు. కొండలో తవ్వుకొన్న బండ కొలతలు, నిల్వ ఉంచిన కంకర కుప్పలు కొలతలు తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిక పంపించడం జరుగుతుందని డీఎస్పీ హుస్సేన్ పీరా వెల్లడించారు.

ఇదీ చదవండి: రాజధానిపై వ్యాజ్యాలు: మే 3 నుంచి రోజువారీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.