అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహాల్ మండలం ఓబులాపురం చెక్‌పోస్టు వద్ద విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ నుంచి ప్రభుత్వం అనుమతి లేకుండా కర్ణాటకలోని బళ్లారికి తెల్ల కంకర తరలిస్తున్న పది ఇసుక టిప్పర్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. కర్ణాటక సరిహద్దున ఉన్న డి.హిరేహాల్ బొమ్మనహాళ్ మండలాలకు ప్రతిరోజు రాత్రివేళల్లో అక్రమంగా ఎర్రమట్టి, ఇసుకను బళ్లారికి తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు టిప్పర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: