అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీమంత్రి రఘువీరారెడ్డి నిర్మించిన దేవాలయాలు 19న ప్రారంభం కానున్నాయి. ఈ విషయం తెలుసుకున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉత్తరం ద్వారా రఘువీరారెడ్డిని అభినందించారు. గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

1200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయాలను పునరుద్ధరించడం, నూతన దేవాలయాలను నిర్మించి ప్రారంభించడం, భారతీయ సనాతన ధర్మానికి దర్పణం. ధార్మిక సంపదకు కేంద్రమైన దేవస్థానాలు సప్త సంతానాల్లో ఒకటి. ఆత్మకు దేహం ఆలయం, ఇంటికి పూజ మందిరం ఆలయం, ఊరికి దేవాలయం అంతే ప్రధానమైనవి. మీ గ్రామంలో అభివృద్ధి చేసిన దేవాలయాలు భారతీయ సంస్కృతికి దర్పణాలు. సందర్శకులకు ఆనందాన్ని, ఆధ్యాత్మికతను అందివ్వాలని ఆకాంక్షిస్తున్నాను. రఘువీరాకు, గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు.-వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి
ఇదీ చదవండీ... mansas trust: రెండేళ్లలో ఎన్నో అలజడులు సృష్టించారు: అశోక్‌గజపతిరాజు