విశ్వహిందూ పరిషత్ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తోందని వీహెచ్పీ జిల్లా గౌరవ అధ్యక్షుడు చారుకీర్తి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ పెద్దలతో పాటు గ్రామ స్థాయి కమిటీ సభ్యులు హాజరయ్యారు. మన ప్రాచీన విధివిధాలను రేపటి తరానికి చేరవేయాలంటే విశ్వహిందూ పరిషత్ ఇలాంటి సంస్థలు గ్రామస్థాయి విస్తరించాల్సిన అవసరముందని చారుకీర్తి తెలిపారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు భారతదేశ కళలు సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వీహెచ్పీ జిల్లా నాయకులు అన్నారు. అనంతరం కదిరి పరిసర ప్రాంతాల్లోని పది మండలాల్లో గ్రామ కమిటీలను ప్రకటించారు.
ఇదీ చదవండీ...