అనంతపురం జిల్లా విడపనకల్ మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉండబండ శ్రీ వీరభద్ర స్వామి వారి రథోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మహా రుద్రహోమం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి కల్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉరవకొండ గవిమఠం ఉత్తరధికారి కరిబాసవ రాజేంద్ర స్వామి, ఆదోని పీఠాధిపతి కల్యాణి స్వామి వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ఆలయ పురవీధుల్లో ఊరేగించి రథంపై ఉంచారు. వేలాది మంది భక్తుల మధ్య స్వామివారి రథోత్సవం కన్నులపండువగా జరిగింది.
ఇదీ చదవండి.