వర్షాల కోసం అనంతపురం ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని శింగనమల మండల కేంద్రంలో ఉన్న రామాలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో వరుణయాగం నిర్వహించారు. ఐదారేళ్లుగా వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే అన్నారు. నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ యాగంతో అయినా వరుణుడు కరుణించాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
ఇది చూడండి: ప్రకృతి అందాలకు నిలయం.. ఈ గోకాక్ జలపాతం