అనంతపురం జిల్లా తనకల్లు మండలం మార్కురి వాండ్లపల్లిలో చలపతి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చలపతి కుటుంబం మదనపల్లెలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. అతని కుమారుడు అశోక్ కుమార్ ఆరునెలల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
తనయుడు మరణించినప్పటి నుంచి మానసికంగా కృంగిపోయిన చలపతి.. స్వగ్రామంలో ఉన్న పొలం వద్దకు వెళ్లాడు. కుమారుని జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని.. మనస్తాపానికి గురయ్యారు. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: డ్రైనేజిలో పడి ఏడాదిన్నర బాలుడు మృతి