ETV Bharat / state

పోలీసుల దెబ్బలు తాళలేక.. కోర్టు ఆవరణలో ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం - అనంతపురం తాడిపత్రిలో యువకులపై పోలీసుల దాష్టీకం

Suicide Attempt: చేయని తప్పు ఒప్పుకోవాలంటూ పోలీసులు వేధింపులకు గురి చేశారు. ఇది భరించలేని ఆ ఇద్దరు యువకులకు ఏం చేయాలో అర్ధం కాలేదు. పోలీసులు కోర్టుకు తీసుకురావడంతో కోర్టు ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

wo youths attempted suicide on the grounds of filing false cases
కోర్టు ఆవరణలోనే విషం తాగిన బాధితులు
author img

By

Published : Sep 2, 2022, 8:17 PM IST

Suicide Attempt in Court Premises: అనంతపురం జిల్లా గుత్తి కోర్టులో విషం తాగి ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు. చేయని తప్పు ఒప్పుకోవాలని పోలీసులు వేధించడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. అసలేం జరిగిందంటే.. వెంకటరెడ్డిపల్లి గ్రామంలో గొర్రెల దొంగతనం జరిగింది. పోలీసులు డ్రైవర్​ మనోహర్​, కార్పెంటర్​ చంద్ర కుల్లాయప్పను దొంగతనం చేశారని పోలీసులు ​స్టేషన్​కు తీసుకెళ్లారు. తాము దొంగతనం చేయలేదని వారిద్దరూ పోలీసులకు ఎదురు చెప్పారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు.. వారిద్దరిని చితకబాదారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని చిత్రహింసలకు గురి చేశారని బాధితులు వాపోయారు. చేయని తప్పు ఒప్పుకోలేక.. పోలీసుల దెబ్బలకు తాళలేక.. ఏం చేయాలో దిక్కుతోచక విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు.

వెంకటరెడ్డిపల్లి గ్రామంలో గొర్రెల దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని తాము చేసినట్లుగా ఒప్పుకోవాలంటూ పోలీసులు చిత్రహింసలు పెట్టారు. చేయని తప్పును ఎలా ఒప్పుకోవాలని ప్రశ్నించాం. అలా అడిగినందుకు తమను తీవ్రంగా కొట్టారు. పోలీసు దెబ్బలు తాళలేక..లేఖ రాసి గుత్తి కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేశాం. గొర్రెలు పోయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, పోలీసులు ఉద్దేశపూర్వకంగా చిత్రహింసలు పెట్టారు. -బాధితులు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.