ETV Bharat / state

theft తాళం వేసి బయటకు వెళుతున్నారా..? అయితే మీ ఇంట్లో చోరీ జరిగినట్లే..!

author img

By

Published : Feb 8, 2022, 11:07 AM IST

theft case in kadiri ఈ రెండు ప్రాంతాలు నిత్యం రద్దీగా, జనసందడిగా ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలలోనే పట్టపగలు దొంగతనాలు జరగడంతో శాంతి భద్రతల పర్యవేక్షణపై సందేహం కలుగుతోంది. మూడు నెలల కిందట దొంగతనం, మహిళ హత్య ఘటన మరవక ముందే, తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడంటే....

theft cases in kadiri
కదిరిలో పట్టపగలే చోరీలు

kadiri theft case అనంతపురం జిల్లాలో మూడు నెలల కిందట దొంగతనం, మహిళ హత్య ఘటన మరవక ముందే తాజగా తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరగడంతో ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని కదిరిలో పట్టపగలే ఒకే రోజు వేర్వేరు ప్రాంతాలలో రెండు చోరీలు జరిగాయి. తాజాగా చోరీలు జరిగిన రెండు ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉండేవే. జన సందడి ఉండే ప్రదేశాలలోనే పగలు దొంగలు పడడంతో శాంతి భద్రతల పర్యవేక్షణ పై సందేహం కలుగుతోంది.

అసలేం జరిగింది....

కదిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కోనేరు సమీపంలో వీరబ్రహ్మేంద్రస్వామి గుడి వద్ద గిరి అనే వ్యక్తి ఉండేవాడు. ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలసి దేవుడి దర్శనం కోసం శ్రీశైలం వెళ్లారు. ఇది అదనుగా దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 45,000 రూపాయల నగదు, 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

ఇంటి తాళాలు పగులగొట్టిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు యజమానికి సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన ఇంటిని పరిశీలించి, క్లూస్ టీంతో ఆధారాలను సేకరించారు.

అదే రోజు పట్టణములోని సైదాపురం వద్ద హోం గార్డ్ రవి ఇంటికి తాళం వేసి ఓ వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లాడు. అది గమనించిన దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి 13,500 రూపాయలు అపహరించుకుని వెళ్లారు. తాళం పగలగొట్టిన విషయాన్ని గుర్తించిన అతను ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా కనిపించాయి. బీరువాలో ఉంచిన 13,500 రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదీ చదవండి: పట్టపగలే భారీ చోరీ.. రూ.18 లక్షలు అపహరణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.