అనంతపురం జిల్లా రాయదుర్గం కనేకల్ ఆర్ అండ్ బి ప్రధాన రహదారిలోని కొంతనపల్లి గ్రామ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం పట్టణానికి చెందిన మురళి (22), అశోక్ (34) అనే ఇద్దరు దుర్మరణం చెెందారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు... రాయదుర్గం పట్టణంలో యూఎస్ ఫ్యాషన్స్ గార్మెంట్స్ యజమాని... షిఫ్ట్ డిజైర్ కారు నీళ్లతో కడగడానికి కనేకల్ రోడ్డులోని ఎంసీఏ కళాశాల వద్దకు తీసుకెళ్లారు. డ్రైవర్ మురళి కారును అతని స్నేహితుడు అశోక్‌కు నడపడానికి ఇచ్చాడు. కొంతనపల్లి వద్ద వేగంగా వెళ్లడంతో... అదుపుతప్పి కారు మూడు పల్టీలు కొట్టి...రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఇరువురూ అక్కడికక్కడే మరణించారు. వారి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రాయదుర్గం ఎస్సై రాఘవేంద్ర ప్రమాద స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి: