ETV Bharat / state

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - అనంతపురం జిల్లా వార్తలు

ROAD ACCIDENT : అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ వ్యక్తులు ప్రాణాలు కొల్పోయారు. హిందుపురానికి మిరపకాయల విక్రయానికి వెళ్లిన.. కడప జిల్లా ప్రొద్దుటూరు వాసులకు మృతువు ఐచర్​ రూపంలో వచ్చి ప్రాణాలు తీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ROAD ACCIDENT
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Dec 20, 2022, 2:10 PM IST

TWO KILLED IN ACCIDENT : అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పెనుబోలు సమీపాన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి గాయపడ్డాడు. మృతులు వైఎస్సార్​ జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన మాధవ, గురుస్వాములుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మాధవ, గురుస్వాములు హిందుపురానికి బొలెరో వాహనంలో మిరపకాయల లోడు తీసుకుని వెళ్తున్నారు. పెనుబోలు సమీపానికి రాగానే వారి ప్రయాణిస్తున్న వాహనం టైర్​ పంచర్​ కావటంతో.. రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి టైరు మారుస్తున్నారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఐచర్​ వాహనం వీరిని వేగంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మాధవ, గురుస్వాములు మృతి చెందారు. ఐచర్​ వాహన డ్రైవర్​ సంతోష్​కు తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.