ETV Bharat / state

స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఇద్దరికి గాయాలు

గుత్తి మండలం కె.ఉబిచెర్ల గ్రామంలో ఇంటి మందు స్థలం విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

two brothers clash over space  injuries to both at anathapur district
స్థల విషయంలో ఇరువర్గాల ఘర్షణ...ఇద్దరికి గాయాలు
author img

By

Published : May 17, 2020, 11:04 PM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం కె.ఉబిచెర్ల గ్రామంలో ఇంటిముందు స్థలం విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గంగరాజు, లింగరాజు అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ఇంటి ముందు స్థలం విషయంలో కొన్ని రోజులుగా అన్నదమ్ముల మద్య చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకోవడంతో, ఈ విషయంపై పెద్దల సమక్షంలో మాట్లాడాలంటూ రామగోపాల్, రామాంజనేయులు, భూషన్న అనే వ్యక్తులు అన్నదమ్ములైన రంగరాజు గంగరాజు అనే వ్యక్తులను పిలిపించారు.

ఈ క్రమంలో పెద్దలు మాట్లాడుతుండగానే రామగోపాల్, రామాంజనేయులు, భూషన్న అనే వ్యక్తులు గంగరాజు, లింగరాజు అనే వ్యక్తులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అన్నదమ్ములు గంగరాజు, లింగరాజుకు తీవ్రగాయాలు కావడంతో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:గ్యాస్ ట్యాంకర్ బోల్తా... ఆందోళనలో గ్రామస్తులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.