ఆపదలో ఉన్న పేద కుటుంబానికి స్వచ్ఛంద సంస్థల సభ్యులు లక్ష రూపాయలు విరాళంగా అందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీ, భార్య భాను కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పుట్టిన 5 రోజులు పాపకు అనారోగ్య సమస్య తలెత్తింది.
రూ. 50 వేలు ఖర్చుతో శస్త్ర చికిత్స చేయాలని బెంగళూరు వైద్యులు చెప్పారు. ఆదరణ సేవా సమాజ్ ట్రస్ట్ నిర్వాహకుడు లాల్ బాషా, అనంతపురంలోని సహృదయ, ఫ్రెండ్స్ సొసైటీ, యువ నేత్రి సేవా సమితి సభ్యులు విరాళాలు సేకరించారు. రఫీకి బెంగళూరులో నగదు అందించారు. ఆదుకున్న అందరికీ బాషా కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: