హైదరాబాద్కు చెందిన కొంత మంది ట్రాన్స్జెండర్లు మాముళ్ల కోసం వేధిస్తున్నారని అనంతపురానికి చెందిన హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాయలసీమకు చెందిన ట్రాన్స్జెండర్ యూనియన్ సభ్యులు..హైదరాబాద్లోని ట్రాన్స్జెండర్ యూనియన్ లీడర్లకు గత కొన్నేళ్లుగా మాముళ్లు చెల్లిస్తూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మాముళ్లు చెల్లించమని రాయలసీమ ట్రాన్స్జెండర్స్ యూనియన్ సభ్యులు తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ట్రాన్స్జెండర్లు దాదాపు 500 మంది అనంతపురం నగరంలోని ఓ కళ్యాణ మండపంలో ఉలిగమ్మ దేవత ఉత్సవాన్ని నిర్వహించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ ట్రాన్స్ జెండర్స్ ఈ సమయంలో అందరూ ఒకే చోట ఉన్నారని గ్రహించి వారిపై బుధవారం రాత్రి దాడి చేసే ప్రయత్నం చేశారు. దాదాపు 700 మందికి పైగా ట్రాన్స్జెండర్లు బస్సులు, వివిధ వాహనాల్లో చేరుకొని ఉత్సవంలో ఉన్న వారిపై పై దాడి చేయాలని ప్రయత్నించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయలసీమకు చెందిన ఓ ట్రాన్స్జెండర్ను హైదరాబాద్ ట్రాన్స్జెండర్లు కిడ్నాప్ చేశారని వారు ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని పలువురు హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి