ETV Bharat / state

హిందూపురం మిర్చి మార్కెట్​లో వ్యాపారుల దోపిడీ... ఏజెంట్ల దందా! - హిందూపురం మిర్చి మార్కెట్ వార్తలు

అనంతపురం జిల్లా హిందూపురం మిర్చి మార్కెట్​లో వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు రైతులను నిలువునా దోచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ-నామ్ పద్ధతిలో వ్యాపార లావాదేవీలకు పాతరేసిన మార్కెట్ అధికారులు, వ్యాపారుల దోపిడీకి కొమ్ముకాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మార్కెట్​కు వచ్చిన ఎండు మిర్చికి వ్యాపారులు నిర్ణయించినదే ధర అన్న వ్యవహారంతో అన్నదాతను నిలువుదోపిడీ చేస్తున్నారు. మిరప నాణ్యత లేదని ధర తగ్గించటం.. తరుగు కింద 20 కిలోల మిర్చికి కిలో చొప్పున దోచేస్తున్నారు. మరోవైపు 2 శాతం తీసుకోవాల్సిన కమిషన్​ను 4 శాతం తీసుకుంటున్నా మార్కెట్ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

hindupuram mirchi market
హిందూపురం మిర్చి మార్కెట్​లో వ్యాపారుల దోపిడీ. ఏజెంట్ల దందా!
author img

By

Published : Oct 12, 2020, 5:13 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది నాణ్యమైన ఎండు మిర్చి, చింతపండు. హిందూపురం మార్కెట్​కు అనంతపురం జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి మిరప పెద్దఎత్తున అమ్మకానికి వస్తుంది. మిరప సాగు అధిక పెట్టుబడులతో సాగుచేసే పంట. ఎంతో వ్యయప్రయాసలతో మిరప సాగుచేసిన రైతులు.. మార్కెట్​లో కమిషన్ ఏజెంట్లు, వ్యాపారుల మోసంతో తీవ్రంగా నష్టపోతున్నారు.

పెట్టుబడులు ఎక్కువ -ధర తక్కువ..

ఏటా ఆగస్టు నెల నుంచి డిసెంబర్ వరకు రైతులు మిర్చిని అమ్మకానికి తెస్తారు. 2018-19 సంవత్సరంలో హిందూపురం మార్కెట్​కు ఎండు మిరప 23 వేల 673 క్వింటాళ్లు రాగా, అప్పట్లో గరిష్టంగా క్వింటా ధర రూ. 19 వేల రూపాయలు పలికింది. 2019-20లో 16 వేల 652 క్వింటాళ్లు రాగా, ఆ ఏడాది గరిష్టంగా రైతులకు రూ. 23 వేల రూపాయలు ఇచ్చారు. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో 2 వేల 138 క్వింటాళ్లు వచ్చింది. ఇప్పటి వరకు వ్యాపారులు రైతులకిచ్చిన గరిష్ట ధర రూ. 16 వేల రూపాయలు మాత్రమే. ఓవైపు పెట్టుబడులు పెరుగుతూ, మరోవైపు కూలీలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతుంటే మార్కెట్​లో వ్యాపారులు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటకెక్కిన ఈ-నామ్.. వ్యాపారులు చెప్పిందే ధర

హిందూపురం మార్కెట్ యార్డులో ఈ-నామ్ పద్ధతిలో మిరప కొనుగోలు చేయాల్సి ఉంది. రైతులు యార్డుకు తీసుకొచ్చిన ఎండు మిరపకు నాణ్యత పరీక్షలు నిర్వహించి ఈ-నామ్ పోర్టల్​లో నమూనా ఫోటోలు పెట్టాలి. ఆ వివరాలు చూసి జాతీయ స్థాయిలో యూనిఫైడ్ లైసెన్సు పొందిన వ్యాపారులు ఈ-వేలం ద్వారా బిడ్డింగ్ వేయాలి. కాని ఆ మార్కెట్​లో ఇవేవీ జరగకపోగా, వ్యాపారులు నోటికొచ్చిన ధర ప్రకటించేసి, ఈ-నామ్ పోర్టల్​లో నమోదు చేస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారమంతా మార్కెట్ యార్డు అధికారుల ఎదుటే జరుగుతోంది.

అన్నదాతకు అన్యాయం

ఈ-నామ్ పద్ధతిలో కొనుగోలు లావాదేవీలు జరగకపోవటం వల్ల వ్యాపారులు ఎక్కువమంది పాల్గొనక, అన్నదాతలకు అన్యాయం జరుగుతోంది. ఎండు మిర్చికి రైతుల నుంచి 2 శాతం మాత్రమే కమీషన్ తీసుకోవాల్సి ఉండగా 4 శాతం చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది కాకుండా రైతులు తీసుకొచ్చే 20 కిలోల బస్తాకు, కిలో చొప్పున తరుగు రూపంలో దండుకుంటున్నారు. అత్యంత నాణ్యమైన మిరప మార్కెట్ కు వస్తున్నప్పటికీ రైతులకు కనిష్టంగా రూ. 7 వేలు, గరిష్టంగా రూ. 15,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. తాము కష్టపడి సాగుచేసిన మిరపకు తక్కువ ధరలు ఇస్తూ దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.

ఏజెంట్ల దందా

ఈ-నామ్ అమలు చేస్తున్న మార్కెట్ యార్డుల్లో కమీషన్ ఏజెంట్ల వ్యవస్థను పూర్తిగా రద్దుచేస్తున్నారు. అయితే రాష్ట్ర మార్కెటింగ్ శాఖ.. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా కమీషన్ ఏజెంట్ల వ్యవస్థకు కొమ్మకాస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలపరిమితి తీరిన కమీషన్ ఏజెంట్లకు ట్రేడర్ లైసెన్సులు ఇస్తోంది. హిందూపురం మార్కెట్ యార్డులో 115 మంది ఏజెంట్ల లైసెన్సులు ఉండగా, వీటిలో 6గురి లైసెన్సుల కాలపరిమితి తీరిపోయింది. వీరికి ట్రేడర్ లైసెన్సు ఇవ్వలేదు. ఈ 6గురు కమిషన్ ఏజెంట్లు యార్డులో దుకాణాలు నడుపుతూ, దర్జాగా రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేస్తూ, లావాదేవీలు నిర్వహిస్తూ.. ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారు. లైసెన్సు రెన్యూవల్ చేయటానికి వీలులేకపోయినప్పటికీ యార్డులో నుంచి ఈ కమిషన్ ఏజంట్లను ఖాళీ చేయించని అధికారుల వ్యవహారంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. కొనుగోలుదారులు ఎవరైనా మార్కెట్​కు వచ్చి మిర్చి కొనుగోలు చేయవచ్చని వ్యాపారుల సంఘం ప్రతినిథి చెబుతున్నారు. ఓవైపు రైతులు.. తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఎలాంటి అక్రమాలు జరగటంలేదని అధికారులు చెబుతున్న తీరుపై నిఘా వ్యవస్థ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

రైతుల కష్టాన్ని గుర్తించని ప్రభుత్వం ఎండు మిరపకు క్వింటాకు కేవలం రూ. 7 వేల రూపాయలే మద్దతు ధర ప్రకటించిందని రైతులు అంటున్నారు. ఈ మద్దతు ధరనే ప్రామాణికంగా తీసుకుంటున్న వ్యాపారులు, దీనికంటే కొద్దిగా ధర పెంచి అన్నదాతలను దోచుకుంటున్నారు. మద్దతు ధర నిర్ణయంలో వాస్తవ సాగు ఖర్చును పరిగణనలోకి తీసుకోవటంలేదని అన్నదాతలు ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి..

కొద్దిగంటల్లో తీవ్రంగా మారనున్న వాయుగుండం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.