ETV Bharat / state

మద్యానికి డబ్బుల్లేక ట్రాక్టర్​ చోరీ... నిందితుడు అరెస్ట్ - ధర్మవరం తాజావార్తలు

మద్యానికి బానిసైన ఓ ట్రాక్టర్​ డ్రైవర్​.. తాగేందుకు డబ్బులు లేక యజమాని ట్రాక్టర్​ను చోరీ చేశాడు. వాహనం విడిభాగాలను విక్రయించేందుకు తీసుకెళ్తూ పోలీసులకు చిక్కాడు.

theft
చోరీకి సంబంధించిన వివరాలు చెబుతున్న పోలీసులు
author img

By

Published : Jun 1, 2021, 1:06 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో రెడ్డి సురేశ్​ అనే ట్రాక్టర్ డ్రైవర్... ఇటుకల బట్టీ యజమాని రవినాథ్​ ట్రాక్టర్​ను చోరీ చేశాడు. వాహనం కనిపించకపోవటంపై యజమాని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుట్టపర్తి మండలం మామిళ్లకుంట వద్ద చోరీ అయిన ట్రాక్టర్​ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు.. పోలీసులు అక్కడకు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు.

నెల రోజులుగా ఉపాధి లేక.. ఆదాయం కరవైందని రెడ్డి సురేశ్​ పోలీసులకు తెలిపాడు. మద్యం తాగేందుకు డబ్బుల్లేక ట్రాక్టర్​ను దొంగలించి.. విడిభాగాలు బెంగుళూరులో అమ్మేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. మద్యం కోసం దొంగతనానికి పాల్పడిన రెడ్డి సురేశ్​పై కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు పంపుతామని తెలిపారు.

ఇదీ చదవండి:

పాతవార్త చూసి కొత్తగా చోరీకి పథకం.. పరారవుతూ పోలీసులకు చిక్కి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.