పెనుకొండ మండలం గుట్టూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హిందూపురం నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాలను వెనక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా మారగా... క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బెంగళూరుకు తరలించినట్లు వైద్యులు వివరించారు. గాయపడినవారు హిందూపురం ప్రాంత వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: