అనంతపురం జిల్లా కదిరి డివిజన్లో కరోనా కలకలం రేపుతోంది. మహమ్మారి దెబ్బకు మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు ఉద్యోగులు బలైపోయారు. తనకల్లు మండలంలోని మేజర్ పంచాయతీ కార్యాలయం అటెండర్ గా పనిచేస్తున్న రమణమ్మ.. తిరుపతి స్విమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పులివెందుల ఆర్టీసీ డిపోలో కండక్టరుగా పనిచేస్తోన్న వెంకటరమణ కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. గాండ్లపెంట మండల పరిషత్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తోన్న ప్రభాకర్ వైరస్ బారిన పడిన చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు.
ఇదీ చదవండి:
విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. ఇద్దరు కొవిడ్ రోగులు మృతి