అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలో బీసీ కాలనీలోని రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. ఇంట్లోని వారంతా డాబాపై నిద్రింస్తుండగా.. తెల్లవారుజామున దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు.
ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదు, 2 పట్టు చీరలు దోచుకెళ్లారని చెప్పారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: