అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెదేపా నేతలు సుమారు యాభై మంది వైకాపాలో చేరారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి ఎన్నికలు వాయిదా వేయించారని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం సైతం ఎన్నికల సంఘానికి వత్తాసు పలకడం దారుణమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వైకాపాలో చేరిన తెదేపా నాయకులు - వైకాపాలో చేరిన తెదేపా నాయకులు
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు యాభై మంది తెదేపా నాయకులు వైకాపాలో చేరారు. ఎన్నికల సంఘం పునరాలోచించి ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కోరారు.
అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెదేపా నేతలు సుమారు యాభై మంది వైకాపాలో చేరారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి ఎన్నికలు వాయిదా వేయించారని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం సైతం ఎన్నికల సంఘానికి వత్తాసు పలకడం దారుణమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:సరస్వతమ్మను చేరాలంటే.. గంగమ్మను దాటాలి