అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంట గ్రామంలో ఓ యువకుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి హల్చల్ చేశాడు.తన పొలం నుంచి ఓ ప్రముఖ కంపెనీ సిబ్బంది.. అక్రమంగా పవర్ లైన్ వేశారంటూ ఆరోపిస్తూ ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడు.
అయితే ఈ అంశంపై స్పందించిన కంపెనీ ప్రతినిధులు తాము మూడు సంవత్సరాల క్రితమే పవర్ లైన్ పనులు చేశామని, అప్పుడు మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ లైన్ తొలగింపునకు ఐదు రోజుల గడువు ఇవ్వాలని కోరినప్పటికీ.. అతను ఒప్పుకోకుండా విద్యుత్ స్తంభం కూల్చే ప్రయత్నం చేయటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని బాధితుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీచదవండి.