అనంతపురంలో మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఎన్నికల హామీలను తప్పకుండా అమలు చేస్తూ... హామీల్లో లేని అంశాలను సైతం చేస్తున్నారని కొనియాడారు.
కళ్యాణదుర్గంలో ...
కళ్యాణదుర్గం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ అంధత్వంతో బాధపడకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు, శస్త్రచికిత్సలు చేస్తామని అన్నారు.
గుంటూరులో...
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని గుంటూరులో అధికారులు ప్రారంభించారు. స్థానిక అమరావతి రోడ్డులోని 140వ నెంబర్ వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ హాజరయ్యారు. 60 సంవత్సరాల పైబడిన వృద్దులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 29 వరకూ కంటి పరీక్షలు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
కడపలో ...
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలంలో కంటి వెలుగును ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి కిరణ్ పాల్గొన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకమైందని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో రావులపాలెం గ్రామ పంచాయతీ వద్ద ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. అలాగే గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లను అందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చూడండి: