అనంతపురం జిల్లాలో గొర్రెల దొంగలు బీభత్సం సృష్టించారు. తిమ్మాపురం గ్రామంలో గొర్రెల కాపరి పై నలుగురు దుండగులు దాడి చేసి, భారీగా గొర్రెలను ఎత్తుకుపోయారు. వ్యూహత్మకంగా గొర్రెల కాపరిపై ఒకరు ఆ తరువాత ఇద్దరు, మరలా నలుగురు కలసి, కాపరి నాగరాజుపై దాడికి పాల్పడి గొర్రెలను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు చెప్పాడు. గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్య కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:నాన్న.. నన్నెందుకు ఇలా చేశావ్!