అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం జయనగర్ కాలనీలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. కాలనీలోని 16వ రోడ్డులో నివాసం ఉండే రాజయ్య(35) వ్యవసాయ కూలీ కాగా... 14 నెలల క్రితం రాజయ్య భార్య నాగేశ్వరమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో రాజయ్య కూలీ పనులకు వెళ్లకుండా.. మద్యానికి బానిసై.. తన ఇంటి మీద రూ.లక్ష అప్పు చేసి ఇంటికి రాకుండా తిరుగుతున్నాడని బంధువులు తెలిపారు. అనంతరం నిన్న రాత్రి ఇంటికి వచ్చి బయట మంచంపై పడుకున్నాడు. తెల్లవారే సరికి రక్తపు మడుగులో మృతదేహంగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీచూడండి.ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య