అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిసరాల్లో పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమి చదును చేసేందుకు అధికారులు ప్రయత్నించగా కొంత ఉద్రిక్తత జరిగింది. కళ్యాణదుర్గం పరిసరాల్లోని ముదిగల్లు రింగు రోడ్డు సమీపంలో 11 ఎకరాల భూమిని అధికారులు ఇంటి స్థలాల కోసం గుర్తించారు. ఈ స్థలంలో కొలతలు వేసి, చదును చేసేందుకు అధికారులకు అక్కడికి వచ్చారు. ఈ భూమిపై తమకూ హక్కు ఉందని మరో వర్గం అక్కడికి వచ్చి అధికారులను అడ్డుకున్నారు.
భూమికి సంబంధించిన రికార్డులు తీసుకురావాలని తెలిపినా... ఇంతవరకు రికార్డులు తీసుకురాలేదని కళ్యాణదుర్గం ఆర్డీవో రామ్మోహన్ తెలిపారు. మంగళవారం అధికారులు స్థలాలను చదునుచేస్తుండంగా ఓ ప్రజాప్రతినిధికి చెందిన వ్యక్తులు అక్కడి రావటంతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ వెంకటరమణ పర్యవేక్షణలో పోలీసు అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదీ చదవండి : కక్ష సాధించేందుకే అచ్చెన్నపై కేసులు: తెదేపా నేతలు