ETV Bharat / state

సజీవ దహన ఘటన.. బాధ్యులపై చర్యలకు తెలుగు యువత డిమాండ్​ - ap news

Protest for exgratia: అనంతపురం జిల్లా చిల్లకొండయ్యపల్లిలో.. ఆటోపై విద్యుత్‌ తీగ తెగిపడి సజీవదహనమైన ఐదు కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని తెలుగు యువత ఆందోళన చేపట్టింది. అనంతపురంలోని విద్యుత్ ఎస్​ఈ కార్యాలయాన్ని ముట్టడించగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

1
1
author img

By

Published : Jul 1, 2022, 3:13 PM IST

Telugu Youth Protest at SE office: గురువారం విద్యుత్​ తీగలు తెగిపడి సజీవ దహనానికి గురైన ఐదుగురు మహిళల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని తెలుగు యువత నేతలు, కార్యకర్తలు డిమాండ్​ చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో అనంతపురంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముట్టడికి యత్నించారు. విద్యుత్ శాఖ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ తీగ తెగిపడిందని తెలుగుయువత కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.50 లక్షలు పరిహారం ఇవ్వటంతోపాటు.. సంఘటనపై విచారణ జరిపి బాధ్యులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్ఈ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లే యత్నం చేసిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.